MLA Anagani: టీచర్లపై కక్ష సాధింపు చర్యలు దర్మార్గం: ఎమ్మెల్యే అనగాని
ABN , First Publish Date - 2023-10-29T10:43:37+05:30 IST
అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తిరిగి వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తిరిగి వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచి, మద్యం అమ్మించారని, వారిచేత బాత్ రూమ్‌లు కడిగించారని ఆరోపించారు. బదిలీల విషయంలో న్యాయం చేయమని అడినందుకు ఉపాధ్యాయులపై లాఠీ ఝులిపించారని మండిపడ్డారు.
పీఆర్సీపై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించారని, సీపీఎస్ రద్దు హామీని అమలు చేయమంటే భౌతికంగా దాడులు చేశారని ఎమ్మెల్యే అనగాని విమర్శించారు. మూడేళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ల కుటుంబాన్ని ఆదుకోలేదని విమర్శించారు. టీచర్లకు విద్యార్థుల హాజరు, బాత్ రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడు నేడు ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి యాప్‌ల భారం మోపారని, సీపీఎస్ఉ ద్యమం చేశారని అనేక మందిపై బైండోవర్ కేసులు పెట్టారన్నారు.
ఒకరోజు ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయుల విధులు నిర్వహిస్తే వారి బాధలేంటో ఆయనకు తెలుస్తాయని ఎమ్మెల్యే అనగాని అన్నారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీచర్లను ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.