Nadendla Manohar: అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే శక్తి జనసేన

ABN , First Publish Date - 2023-08-05T17:19:14+05:30 IST

గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది పెద్దలు కృషి చేశారని జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు.

Nadendla Manohar: అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే శక్తి జనసేన

అమరావతి; గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది పెద్దలు కృషి చేశారని జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వంలో నిధులు మళ్లించి అభివృద్ధి లేకుండా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో ఎదుర్కొని మీరంతా నిలబడి గెలిచారు.స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనేదే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంకల్పం. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే శక్తి జనసేనకు ఉంది. గ్రామంలో అందరూ ఒక్కటే అనే భావన గతంలో ఉండేది. రాజకీయాలకు సంబంధం లేకుండా సర్పంచ్‌ల ఎన్నిక జరిగేది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కుల విద్వేషాలు రెచ్చగొడుతోంది. నిధులు లేక పంచాయతీల అభివృద్ధి ఆగిపోయింది. పంచాయతీ వ్యవస్థకు పోటీగా వలంటీర్ వ్యవస్థను జగన్(JAGAN) తెచ్చారు. మీకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Updated Date - 2023-08-05T17:19:14+05:30 IST