Share News

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

ABN , First Publish Date - 2023-10-13T21:29:32+05:30 IST

టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు.

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

అమరావతి: టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు. శెక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలంయలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మేము అడిగిన ప్రశ్నలపై మంత్రి బొత్స స్పందించాలి. జగన్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం జనసేన బాధ్యత. ప్రజల సొమ్మును, ప్రభుత్వ ఆస్తులను జగన్‌రెడ్డి దోచుకుంటున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని దోపిడీని నిలదీస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెబుతూనే.. దోచేసుకుంటున్నారు. ప్రభుత్వం అనేక చీకటి ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవం కాదా. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు. విద్యాశాఖ మంత్రి సూచనల మేరకే ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. మంత్రి బొత్స... ఈ నాలుగేళ్లల్లో విద్యాశాఖ ఖర్చు పెట్టిన లెక్కలను చెప్పగలరా..? మీ అగ్రిమెంట్‌లోనే ఈటీఎస్ సంస్థనే టోఫెల్ స్కోర్ కేవలం రెండేళ్లు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పింది. ఆ సమాచారం ఆ తర్వాత భద్రపరచలేమని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంతా ఆన్‌లైన్ అని చెప్పిన మంత్రి గారూ.. పేరా 50.1 లో చాలా క్లియర్‌గా చెప్పింది. మరి ఈ సమాచారం మీ దృష్టికి రాలేదా.. మీకు తెలియదా..? టోఫెల్ పరీక్ష అనేది అమెరికాలో చదివే విద్యార్థులకు అడుగుతారు.డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంజనీరింగ్ నాలుగో ఏడాది, అమెరికా వెళ్లే ముందు పరీక్ష రాస్తారు. మూడో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు టోఫల్ పరీక్ష ఎందుకు..? కోటి ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మంత్రి ఆడుకుంటున్నారు’’ అని నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ చీకటి ఒప్పదంపై బాధ్యత వహించాలి

‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నలభై వేల మందికి మాత్రమే వీసాలు దొరికాయి. ఈ చీకటి ఒఫ్పందంపై సంబంధిత శాఖకు మంత్రిగా బాధ్యత తీసుకుని బొత్స సమాధానం చెప్పాలి. పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించడానికి తగినంత మంది ఉపాధ్యాయులు లేరు. ప్రతి విద్యార్థికి కేవలం 7.50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని బొత్స చెబుతున్నారు. కానీ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి 156కోట్లు రూపాయలు ఖర్చు అవుతుంది. ఉపయోగం లేని పరీక్ష కోసం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. మూడు నుంచి పది వరకు అనవసరమైన పరీక్షలు ఎందుకో చెప్పాలి. ఇలాంటి విధానాల వల్లే మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ప్రకటించుకుంటే.. ఎన్నికల సంఘం ఆమోదించబోమని చెప్పింది. ఎన్నికల సంఘం రాసిన లేఖ ప్రకారం మీకు పార్టీ అధ్యక్షుడు కూడా లేడు. మీరా మా జనసేన పార్టీపై విమర్శలు చేసేది. మీ స్వార్థం కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తారా..? పిల్లలు మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విద్యా విధానం మార్చాల్సిన అవసరం ఉంది. మంత్రి గారూ 54 పేజీల అగ్రిమెంట్ కాపీని మరోసారి చదువుకోండి. టోఫెల్ టెస్ట్‌ను ఎవరు కోరారని ఈ కొత్త విధానం తెచ్చారు. మంచి విద్యను అందించాలంటే.. ఉత్తమ ఉపాధ్యాయులను నియమించండి. టోఫెల్ పరీక్షపై ఆధారాలతో సహా చూపించాను.. సమాధానం చెబుతారా..? ఏ ప్రింటర్‌కి ఇవ్వాలో, ఏ పేపర్ వాడాలో ఆ సంస్థ ప్రభుత్వానికి చెప్పడం ఏమిటి ..? మేము అడిగిన వాటికి మంత్రి స్పందించాలి’’ అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-13T21:29:32+05:30 IST