Nara Lokesh YuvaGalam: కాసేపట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

ABN , First Publish Date - 2023-08-19T16:25:19+05:30 IST

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉండవల్లి నుంచి ప్రారంభమైంది (Nara Lokesh YuvaGalam). 188వ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నేటితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగియనుంది.

Nara Lokesh YuvaGalam: కాసేపట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

అమరావతి: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉండవల్లి నుంచి ప్రారంభమైంది (Nara Lokesh YuvaGalam). 188వ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నేటితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు తరలివచ్చారు. ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. పాదయాత్రలో కూరగాయల దండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాడేపల్లి రూరల్ మండలానికి చెందిన లోకేష్ అభిమానులు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర లోకేష్‌‌కు ఘన స్వాగతం చెప్పేందుకు తెలుగు దేశం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

Updated Date - 2023-08-19T16:25:19+05:30 IST