Purandhareswari : దొంగ ఓట్ల నమోదుపై పోరాటం
ABN , First Publish Date - 2023-08-24T17:37:51+05:30 IST
దొంగ ఓట్ల(fake votes) నమోదుపై పోరాటం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandhareswari) అన్నారు.
అమరావతి: దొంగ ఓట్ల(fake votes) నమోదుపై పోరాటం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandhareswari) అన్నారు. గురువారం నాడుబీజేపీ నాయకులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఓటర్ల జాబితా, ఓట్ల నమోదు, దొంగ ఓట్ల తొలగింపు అంశాల పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతి ఇంటికి వెళ్లాలి.పోలింగ్ బూత్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. ఆ దిశగా మండల స్థాయిలోనూ, అసెంభ్లీ కన్వీనర్లు ప్రధానంగా ఓటు నమోదు ప్రక్రియలో కీలక పాత్ర వహించాలి. దొంగ ఓట్లు నమోదు ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఫారం ..6, ఫారం..7 విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిజమైన ఓటరు ఓటు హక్కు కల్పించేందుకు బీజేపీ తరపున రెండు రోజులు పాటు క్యాంపైయిన్ చేయాలి’’ అని పురంధరేశ్వరి పిలుపునిచ్చారు.