Devineni: భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది

ABN , First Publish Date - 2023-01-30T10:31:12+05:30 IST

తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌పై కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు.

Devineni: భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది

గుంటూరు: తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ (TDP State General Secretary Chintakayala Vijay) పై కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Umamaheshwar rao))ఆరోపణలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఉన్నత విద్యావంతుడైన విజయ్‌పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోందన్నారు. సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)డైరక్షన్‌లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇలా సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలన్నారు. భూమి గుండ్రంగా తిరుగినట్లు తమకూ సమయం వస్తుందని అన్నారు. అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కొడాలి, పేర్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిలు ఇద్దరూ హైదరాబాద్‌లో దాక్కున్నారని తెలిపారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరని దేవినేని ఉమా హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే...

‘భారతీ పే’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో గుంటూరు సీఐడీ కార్యాలయానికి విజయ్ వెళ్లనున్నారు. గతేడాది సెప్టెంబరులో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. దీంతో సీఐడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-30T10:31:13+05:30 IST