GV Anjaneyulu: నాలుగేళ్ల వైసీపీ పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు
ABN , First Publish Date - 2023-06-14T16:19:14+05:30 IST
నాలుగేళ్ల వైసీపీ పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. విద్యా ప్రమాణాలు పడిపోయి దేశంలోనే 19వ స్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. మాతృభాషకు తూట్లు పొడిచారని... భావితరాలకు తీరని అన్యాయం చేశారని అన్నారు.
పల్నాడు: నాలుగేళ్ల వైసీపీ (YCP) పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు (TDP Leader GV Anjaneyulu) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పడిపోయి దేశంలోనే 19వ స్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. మాతృభాషకు తూట్లు పొడిచారని... భావితరాలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. 57 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే నాలుగేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఎలిమెంటరీ స్కూల్ విలీనంతో పిల్లలు విద్యకు దూరమయ్యారన్నారు. విదేశీ విద్య నిర్వీర్యంతో పేద విద్యార్థులకు విదేశీ విద్య కరువైందని వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. విద్యా దీవెన సక్రమంగా ఇవ్వకపోవడంతో రెండు లక్షల మంది పిల్లల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద నిలిచిపోయి విద్యార్థుల అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్ట్ భర్తీ లేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. నాడు - నేడు పథకంతో నాయకుల జేబులు నింపుతున్నారు తప్ప పాఠశాలల అభివృద్ధి శూన్యమని జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు చేశారు.