TDP Leaders: ‘వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోంది ’

ABN , First Publish Date - 2023-05-07T08:58:37+05:30 IST

గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.

TDP Leaders: ‘వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోంది ’

పల్నాడు: గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana), మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ (Former MLA Sridhar) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఉదయం పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటను నేతలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... అకాల వర్షాలకు పంటల పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు భరోసా కల్పించే పరిస్థితులో లేదని తెలిపారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో నష్ట పరిశీలన చేయలేదని.. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని అన్నారు. మొక్కజొన్న, మిర్చి రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం రైతులకు అవసరమైన టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వానికి ఇంతవరకు ఉలుకు పలుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని.. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని కన్నా లక్ష్మీనారాయణ, శ్రీధర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-07T09:22:36+05:30 IST