Yarapatineni Srinivas: చంద్రబాబువి ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి

ABN , First Publish Date - 2023-09-09T21:05:31+05:30 IST

చంద్రబాబు(Chandrababu)ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న వీడియోలు ఏఏ విధంగా బయటకు వచ్చాయని తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్(Yarapatineni Srinivas) ప్రశ్నించారు.

Yarapatineni Srinivas: చంద్రబాబువి ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి

అమరావతి: చంద్రబాబు(Chandrababu)ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయని తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్(Yarapatineni Srinivas) ప్రశ్నించారు. శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్ కార్యాలయం మరో వైసీపీ(YCP) కార్యాలయంగా పనిస్తోందనడంలో సందేహం లేదు. ఈ విషయం మీద ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వారికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.ఒకరు, ఇద్దరు అధికారులు కుల పిచ్చితో వారి ఇష్టానుసారం వ్యహరిస్తున్నారు. చంద్రబాబుని ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని యరపతినేని శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వం, సీఐడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-09T21:05:31+05:30 IST