Chandrababu bail petition Live updates: విచారణ మళ్లీ వాయిదా... దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు..

ABN , First Publish Date - 2023-10-05T11:24:52+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development case) ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు (గురువారం) వాదనలు కొనసాగుతున్నాయి.

Chandrababu bail petition Live updates: విచారణ మళ్లీ వాయిదా... దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు..

Live News & Update

  • 2023-10-05T16:35:00+05:30

    • ఈ నెల 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొడగింపు

  • 2023-10-05T16:30:00+05:30

    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

    • న్యాయవాదుల మధ్య తీవ్రమైన వాగ్వివాదంతో నిలిచిన వాదనలు

    • రేపు మధ్యాహ్నం నుంచి వాదనలు వింటానన్న న్యాయమూర్తి

  • 2023-10-05T16:18:00+05:30

    దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు

    • ఏసీబీ కోర్టులో తీవ్రంగా సాగుతున్న వాదోపవాదనలు

    • చంద్రబాబు తరపున ముగిసిన ప్రమోద్ కుమార్ దూబే వాదనలు

    • చంద్రబాబు న్యాయవాదులు చెప్పిన వాదనలపై రిప్లై వాదన వినిపిస్తా అన్న పొన్నవోలు

    • మళ్లీ ఎలా చెబుతారని అభ్యంతరం వ్యక్తం చేసిన దూబే

    • దీంతో దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు

    • కొద్దిసేపు విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి

  • 2023-10-05T15:10:00+05:30

    మరికాసేపట్లో వర్చువల్‌గా న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు..

    • ఈ రోజుతో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.

    • మరికాసేపట్లో చంద్రబాబు రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న జైలు అధికారులు.

  • 2023-10-05T15:04:00+05:30

    • ఏసీబీ కోర్టులో లంచ్ బ్రేక్ అనంతరం చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ప్రారంభమైన వాదనలు

    • చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే.. సిఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి

    Untitled-6.jpg

  • 2023-10-05T13:55:00+05:30

    మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి

    • ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

    • లంచ్ అనంతరం 2.30 గంటలకు మళ్లీ విచారణ ప్రారంభం

  • 2023-10-05T13:29:00+05:30

    చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు..

    • స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను కోర్టుకు సమర్పించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

    • టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించాయని ఆధారాలు చూపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

    • ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను న్యాయమూర్తి ముందు ఉంచిన ప్రభుత్వ తరుపు న్యాయవాదులు.

    • సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి చూపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

    Untitled-5.jpg

  • 2023-10-05T12:50:00+05:30

    ఏసీబీ కోర్టులో ప్రమోద్ కుమార్ దూబే వాదనలు

    ‘‘ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముంది?. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు... అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం’’ అని ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.

    Untitled-3.jpg

  • 2023-10-05T12:09:00+05:30

    ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతోన్న పొన్నవోలు వాదనలు

    • ఒప్పందంలో ఉల్లంఘనలు ఎలా జరిగాయనే అంశాన్ని వివరిస్తోన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

    • కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదన్న పొన్నవోలు.

    • ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడన్న పొన్నవోలు.

    • కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందన్న పోన్నవోలు.

    • ప్రెవెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుందని పొన్నవోలు వాదనలు.

    • చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందన్న ఏఏజీ పొన్నవోలు.

    • సీఐడీ వాదనలకు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే.

  • 2023-10-05T11:34:00+05:30

    • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

    • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు

    • హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాది

  • 2023-10-05T11:30:00+05:30

    • ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు మొదలు

  • 2023-10-05T11:20:00+05:30

    • చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. మెమో దాఖలు చేసిన సీఐడీ

    • చంద్రబాబు రిమాండ్‌ను పొడగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది.

    • 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ కోరింది.

  • 2023-10-05T11:15:00+05:30

    Untitled-2.jpg

    స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development case) ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు (గురువారం) విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు, బెయిల్ మంజూర్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు బుధవారం నుంచి హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. కోర్టులో నేడు విచారణ ముగిసి కీలక తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.

    కాగా బుధవారం కీలక వాదనలు జరిగాయి. ‘‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబుపై నేరారోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను చూపించండి. నిధుల విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఉందా? అప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఎవరు?’’ అని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘రెండేళ్ల క్రితం జరిగిన దర్యాప్తునకు, ప్రస్తుతం జరిగిన దర్యాప్తునకు పెద్దగా తేడా లేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని అడిగిన విషయం తెలిసిందే. మరి నేడు వాదనలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.