Avinash Reddy : సునీత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదులు పాస్ ఓవర్ కోరడంతో..

ABN , First Publish Date - 2023-04-24T13:06:09+05:30 IST

సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ నేడు ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

Avinash Reddy : సునీత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదులు పాస్ ఓవర్ కోరడంతో..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ నేడు ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ ప్రారంభించింది. మధ్యాహ్నం 2.00 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదులు పాస్ ఓవర్ కోరారు. అవినాష్ రెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్కి హాజరు అవుతున్నారు. మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అరెస్టుపై టీ.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో ఇదే కీలకం కానుంది. ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు కేసుల జాబితాలో దీన్ని 24వ నంబరుగా చేర్చారు. ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టే సీబీఐని ఆదేశించినందున.. దర్యాప్తు పొడిగింపు, అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసే అంశంపైన నేటి మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశముంది.

Updated Date - 2023-04-24T13:06:09+05:30 IST