Viveka Murder జరిగిన రోజు కీలకం కానున్న జగన్, భారతి ఫోన్ కాల్స్!
ABN , First Publish Date - 2023-02-03T11:29:04+05:30 IST
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయినప్పటి నుంచి సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది.
అమరావతి : వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు ఏపీ (AP) నుంచి తెలంగాణ (Telangana)కు బదిలీ అయినప్పటి నుంచి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. తాజాగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ని విచారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి కాల్స్ ఎవరెవరికి వెళ్లాయనే విషయమై పోలీసులు ఆరా తీయగా సెన్సేషనల్ విషయాలు వెలుగు చూశాయి. సడెన్‌గా నవీన్ (Naveen) అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు.
నవీన్ ఎవరా? అని ఆరా తీస్తే.. సీఎం జగన్ కుటుంబానికి అంతా తానై వ్యవహరిస్తుంటాడని.. అత్యంత నమ్మిన బంటు అని తేలింది. నవీన్ ఫోన్ నుంచే అవినాష్ రెడ్డి వైయస్ భారతి (YS Bharati)తో మాట్లాడినట్టుగా తేలింది. ఇక మరో వ్యక్తి ఫోన్ నుంచి ఎంపీకి జగన్ (CM Jagan) టచ్‌లో ఉన్నట్టు సీబీఐ గుర్తించనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవీన్‌కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. నేడు సిబిఐ ముందు నవీన్ విచారణ హాజరుకానున్నాడు. వివేక హత్య జరిగిన రోజు పలుమార్లు నవీన్ ఫోన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ చేశారు.
నవీన్ ఫోన్ నుంచి వైఎస్ భారతి మాట్లాడారు. అలాగే ఇక ఓఎస్‌డీ (OSD) ఫోన్‌కి కాల్ చేసి జగన్‌తో అవినాష్ రెడ్డి మాట్లాడారు. నేడు నవీన్‌తో పాటు ఓఎస్‌డీని కూడా సీబీఐ విచారణ చేయనుంది. వదిన భారతితో మాట్లాడాలంటే నవీన్‌కి కాల్ చేసే వాడినని సీబీఐకి అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జగన్‌తో మాట్లాడాలంటే ప్రస్తుత ఎస్‌డీకి కాల్ చేసేవాడని సీబీఐకి అవినాష్ రెడ్డి తెలిపారు. వివేక హత్య జరిగిన రోజు పలుమార్లు ఈ రెండు నెంబర్లకు అవినాష్ రెడ్డి కాల్ చేసినట్టు సమాచారం.