Balineni ఫోన్ ట్యాపింగ్ ఆరోపణపై జగన్ సీరియస్

ABN , First Publish Date - 2023-02-02T18:42:12+05:30 IST

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారని...

Balineni ఫోన్ ట్యాపింగ్ ఆరోపణపై జగన్ సీరియస్

అమరావతి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan reddy) సీరియస్గా తీసుకున్నారని ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని తాను ఛాలెంజ్ చేశానని బాలినేని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఫోన్ కాల్ను ఆయన స్నేహితుడే రికార్డింగ్ చేశారని బాలినేని వెల్లడించారు. పోయే ముందు ఏదో ఒకటి మాట్లాడాలని విమర్శలు చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం దుమారం రేపుతోంది. ట్యాపింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి వేధింపులు, కక్ష సాధింపులు మొదలయ్యాయి. కోటంరెడ్డికి ఏ పని చేయొద్దంటూ జిల్లా అధికారులకు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలకే వేధింపులు మొదలవ్వడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయేమోనని భయపడుతున్నారు. సొంతపార్టీ పెద్దల తీరుపై లోలోన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ నిరూపణ జరిగితే వైసీపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది. గతంలో ట్యాపింగ్ వ్యవహారాలు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీ వర్గాల్లో ట్యాపింగ్ అంశమే ప్రధాన చర్చగా మారింది.

Updated Date - 2023-02-02T18:43:56+05:30 IST