KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

ABN , First Publish Date - 2023-08-11T13:53:49+05:30 IST

కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.

KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

విజయవాడ : కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో గానీ ఏదేదో వాగాడంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని... సిగ్గు, బుద్ధి లేదా? మాయావతి కాళ్ళు పట్టాడంటూ విమర్శలు గుప్పించారు.

పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోబోనని కేఏ పాల్ హెచ్చరించారు. పవన్, చిరంజీవిలపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానన్నారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం లేదని కేంద్రం తో చెప్పించగలవా? అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ కి మాట్లాడటం రాదని.. ఇంగ్లీషు రాదని తనకు అమిత్ షా చెప్పారన్నారు. ఏపీ మీద ప్రేమ లేని వాడే జనసేనలో చేరతాడన్నారు. ‘‘బుద్ధి బుర్ర లేకుండా మాజీ మంత్రి ఎవరో జనసేనలో చేరిందట.. చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశాడు.. పవన్ బీజేపీలో విలీనం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రం గా మార్చాడు. నాకు అవకాశం ఇస్తే అమరావతి ని అభివృద్ధి చేసి చూపిస్తా’’ అని కేఏ పాల్ అన్నారు.

Updated Date - 2023-08-11T13:53:49+05:30 IST