MP Avinash Reddy : పులివెందుల నుంచి భారీగా అనుచరులతో హైదరాబాద్ బయలుదేరిన అవినాష్ రెడ్డి
ABN , First Publish Date - 2023-04-17T07:20:49+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. నిన్న పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. నిన్న పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాగా.. పులివెందుల్లో తన నివాసం నుంచి నేటి తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. 10 వాహనాల్లో అనుచరులతో కలసి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఇప్పటికే అవినాష్‌ను జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 న సీబీఐ విచారణ చేసింది. అవినాష్ విచారణ సమయంలో గతంలో మాదిరిగానే అధికారులు వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి, జగన్ సతీమణి భారతీరెడ్డికి స్వయాన మేనమామ అయిన వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించింది. సోమవారం తమ ముందు హాజరు కావాలని అవినాశ్‌రెడ్డికి కూడా నోటీసులు జారీచేసింది.ఏడు గంటల వరకు భాస్కర్‌రెడ్డిని విచారించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మెమో జారీ చేశారు. 120బీ రెడ్‌విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్ సీజ్ చేసి, ఆయన భార్య లక్ష్మికి మెమో అందించారు. దానిపై ఆయనతో సంతకాలు చేయించారు. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న పి.జనార్దన్‌రెడ్డితో సాక్షి సంతకం పెట్టించారు.