Srikanth Reddy: అవినాష్ రాసిన లేఖపై సీబీఐ స్పందించాలి

ABN , First Publish Date - 2023-01-28T17:41:37+05:30 IST

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) వివేకా హత్య కేసు(Viveka murder case)లో విచారణకు సహకరిస్తారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి( Srikanth Reddy) అన్నారు.

 Srikanth Reddy: అవినాష్ రాసిన లేఖపై సీబీఐ స్పందించాలి

కడప: వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) వివేకా హత్య కేసు(Viveka murder case)లో విచారణకు సహకరిస్తారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి( Srikanth Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రాసిన లేఖపై సీబీఐ (cbi) స్పందించాలని కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా సీబీఐ చూడాలన్నారు. విచారణ మొత్తం వీడియోగ్రఫీ చిత్రీకరించాలన్నారు. నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిపి నిజాలు తేల్చాలని సీబీఐని కోరారు.దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెప్పారు. అవినాష్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకి వస్తారన్నారు. మా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తుకైనా సీబీఐని ఆహ్వానించిందని తెలిపారు. రెండున్నరేళ్లుగా అవినాష్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారని సీబీఐ విచారణకు సహకరిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు కుట్ర పురితంగానే అవినాష్‌రెడ్డి పేరును తెచ్చారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-01-28T17:41:40+05:30 IST