Kadapa: వైఎస్సార్‌కు షర్మిల, విజయమ్మ నివాళులు
ABN , First Publish Date - 2023-07-08T11:11:10+05:30 IST
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
కడప: ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila), సతీమణి విజయమ్మ (Vijayamma) నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపుపులపాయకు రానున్నారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనలు సీఎం జగన్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే అన్నా చెల్లెలు మధ్య నెలకొన్న విభేదాలతో తండ్రి జయంతి కార్యక్రమంలో వేరు వేరుగా పాల్గొనడంపై సర్వత్రాచర్చనీయాంశంగా మారింది.