TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

ABN , First Publish Date - 2023-07-19T15:57:58+05:30 IST

విద్యా వ్యవస్థపై గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఒక్క విద్యార్థి కూడా ఎందుకు ఇంటర్ పాస్ కాలేదో సమాధానం చెప్పాలి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల జూనియర్ కళాశాలలోనే నూరు శాతం సున్నా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర విద్యా విధానాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచటమంటే ఇదేనా?

TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

అమరావతి: జగన్ ప్రభుత్వంపై (Jagan Government) టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి (Bhumireddy Ramagopal Reddy) విమర్శలు గుప్పించారు. ‘‘విద్యా వ్యవస్థపై గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఒక్క విద్యార్థి కూడా ఎందుకు ఇంటర్ పాస్ కాలేదో సమాధానం చెప్పాలి. సీఎం (CM Jagan) సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల జూనియర్ కళాశాలలోనే నూరు శాతం సున్నా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర విద్యా విధానాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచటమంటే ఇదేనా?, పదో తరగతి ఫలితాల్లో విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలవడం సిగ్గుచేటు. అరకు మహిళా కళాశాల తరగతి గదిలో పెచ్చులూడి పడటమేనా నాడు-నేడు నిర్వహణ అంటే. నాడు-నేడు పేరుతో రూ.16 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యావ్యవస్థను అథమ స్థానానికి నెట్టి సర్వనాశనం చేశారు. ప్రాథమిక విద్య, యూజీ, పీజీ అనే తేడా లేకుండా వ్యవస్థ మొత్తాన్ని కుప్పకూల్చారు. ఇష్టం లేని విద్యాశాఖ బాధ్యతలను బొత్స బలవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇతర శాఖకు మారే యోచనలోనే నిత్యం వివాదాలు మాట్లాడుతూ తెలంగాణ నేతలతో తిట్టించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొనకూడదంటూ కడప జిల్లాలో మాత్రమే నల్ల జీవో ఇచ్చిన డీఈవోపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ని కోరుతున్నాను.‌’’ అని రాంగోపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-19T15:57:58+05:30 IST