Andhrajyothy: ఆంధ్రజ్యోతిపై వైసీపీకి మరీ ఇంత కక్షా.. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ..
ABN , First Publish Date - 2023-02-23T12:42:32+05:30 IST
జిల్లాలోని పులివెందులలో ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతలు తమ ఆక్రోశం వెళ్లగక్కారు.
కడప: జిల్లాలోని పులివెందుల (Pulivendula)లో ఆంధ్రజ్యోతి (Andhrajyothy)పై వైసీపీ నేతలు (YCP Leaders) తమ ఆక్రోశం వెళ్లగక్కారు. పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో ఆంధ్రజ్యోతి ప్రతుల(Andhrajyothy copies)ను వైసీపీ శ్రేణులు తగులబెట్టారు. మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్ ఇతర వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసు (Former Minister Vivekanandareddy Case)లో వైఎస్ కుటుంబాన్ని (YS Family) టార్గెట్ చేసి ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలు రాస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే వాస్తవాలు రాస్తే.. పేపర్లు తగులపెట్టడం ఏంటని వైసీపీ నేతలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
కాగా... వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో సీబీఐ అనేక విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో... తన దర్యాప్తులో తేలిన విషయాలను సీబీఐ (CBI)... కోర్టు ముందు ఉంచింది.
సీబీఐ తేల్చిన ప్రకారం... వివేకాను అవినాశ్ రెడ్డి (Avinash Reddy) అడ్డు తొలగించుకోవాలనుకోవడానికి కారణం... తన ఎంపీ సీటుకు అడ్డు రావడం! వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (Devireddy ShivaShankar Reddy)(ఏ5)తో కలిసి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy) కుట్రపన్నారు. దానిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారు. దీనికోసం... వివేకాతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ఆయనపై కోపం పెంచుకున్న ఎర్ర గంగిరెడ్డి (Erra GangiReddy) (ఏ1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ (Yadati Sunil Yadav) (ఏ2), డ్రైవర్ షేక్ దస్తగిరి (Shek Dastagiri)(ఏ4 - అప్రూవర్), ఉమాశంకర్‌రెడ్డి (UmaShankaReddy)లను పోగేశారు. ఈ నలుగురే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించడం, రక్తపు మరకలను తుడిపి వేయించడంలో అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి సీబీఐ ఇదివరకే వెల్లడించింది.
కడప లోక్‌సభ టికెట్ (Kadap Loksabha Ticket) విషయంలో వివేకాతో విభేదాలున్నాయని కూడా తెలిపింది. ఇప్పుడు మాత్రం ‘‘అవినాశ్ రెడ్డే చంపించారు’’ అనేందుకు ప్రాసంగిక సాక్ష్యాలూ ఉన్నాయని చెప్పడం విశేషం. సీబీఐ వెల్లడించిన ప్రకారం... కీలక నిందితుడు సునీల్ యాదవ్ వివేకా హత్య జరగడానికి ముందురోజు సాయంత్రం అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. ఇతర నిందితులూ/పాత్రధారులూ ఆ రోజు అక్కడ కలుసుకున్నారు. ఇక... వివేకా హత్య జరిగిన రోజు ఉదయం పలువురు నిందితులు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఇతర నిందితులకు ఇచ్చిన భరోసా మేరకు... వివేకా ఇంటికి వెళ్లి సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు రెడీగా కూర్చున్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి (Viveka PA MV Krishna Reddy) నుంచి ఫోన్ రాగానే అక్కడికి వెళ్లి... రక్తపు మడుగును శుభ్రం చేయడం, గుండెపోటు కథను ప్రచారం చేయడం, వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజీతో ‘కవర్’ చేయడం వంటివన్నీ చేశారని సీబీఐ తెలిపింది.