Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం
ABN , First Publish Date - 2023-10-20T07:54:49+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారులోనే కొడాలినానితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. చిన్నప్రమాదం కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని తెలుస్తోంది. ప్రమాదం అనంతరం అదే కారులోనే గుడికి వెళ్లారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరోవైపు.. విజయవాడ వైసీపీ నేతలు, వీరాభిమానులు కొందరు కొడాలికి ఫోన్ చేసి ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు.
నిన్న అలా.. ఇవాళ ఇలా..!
కాగా.. గురువారం నాడు కొడాలి నాని ఇంట్లో శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా నాని మేనకోడలి పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ గుడికి వెళ్లగా ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, నాని వీరాభిమానులు షాక్ తిన్నారు. అయితే పెద్ద ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.