Kotamreddy : బాలినేని సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి.. రేపు మీడియా ముందుకు ఎమ్మెల్యే.. ఏం చెబుతారోనని టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2023-01-31T22:19:38+05:30 IST

గత కొన్ని రోజులు నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Kotamreddy : బాలినేని సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి.. రేపు మీడియా ముందుకు ఎమ్మెల్యే.. ఏం చెబుతారోనని టెన్షన్.. టెన్షన్

నెల్లూరు/అమరావతి : గత కొన్ని రోజులు నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar reddy) మీడియా ముందుకు రాబోతున్నారు. బుధవారం నాడు ప్రత్యేకంగా ఆయన మీడియా మీట్ (Press meet) నిర్వహించబోతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి (Balineni Sreenivasulu reddy) వ్యాఖ్యలపై కోటంరెడ్డి రియాక్ట్ కాబోతున్నారు. ప్రెస్‌మీట్‌లో కోటంరెడ్డి ఇంకా ఏమేం మాట్లాడతారు..? అధిష్టానం గురించి ఏయే విషయాలు బయటపెట్టబోతున్నారు..? అసలు ఇంత అసంతృప్తికి కారణాలేంటనే విషయాలపై కోటంరెడ్డి మీడియాముఖంగా వివరించబోతున్నారు.

బాలినేని ఏమన్నారు..?

కోటంరెడ్డి టీడీపీలోకి (Telugudesam) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ చేసిన విషయం నిజమే అయితే నిరూపించాలి. టీడీపీలోకి పోవాలనుకునేవాళ్లే ఇలాంటివి చెబుతారు. ఎవరు ఉన్నా లేకపోయినా.. నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డు (Call Record) చేశారు. కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా?. కోటంరెడ్డి స్నేహితుడే (Kotamreddy Friend) కాల్ రికార్డు చేసి లీక్ చేశారు. కోటంరెడ్డి సోదరుల (Kotamreddy Brothers) మధ్య మేం ఎలాంటి చిచ్చుపెట్టలేదు.. ఆ అవసరం కూడా మాకు లేదు. నెల్లూరు రూరల్ ఇన్చార్జి (Nellore Rural Incharge) పదవి ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు కోరారు.. అయితే కోటంరెడ్డితో ఆ విషయం మాట్లాడుకోవాలని చెప్పేశాం. మంత్రి పదవి జిల్లాలో ఒకరికే దక్కుతుంది. ఐదారుసార్లు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవి (Minister post) దక్కని సందర్భాలు ఉన్నాయి. పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారా? అని కోటంరెడ్డిపై బాలినేని ప్రశ్నల వర్షం కురిపించారు.

Challange.jpg

కోటంరెడ్డి ఏం చేయబోతున్నారు..?

బాలినేని వ్యాఖ్యలను కోటంరెడ్డి చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని బాలినేని చెబుతుంటే.. జరిగిన మాట వాస్తవమేనని నిరూపిస్తానని సవాల్ స్వీకరించారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. అందుకు ఆధారాలు చూపుతానని కోటంరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల (IAS Officers) ఉద్యోగాలు పోతాయని బయటపెట్టట్లేదు కానీ ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పలేదని ఎమ్మెల్యే చెప్పారు. వైసీపీలో (YSR Congress) ఫోన్ ట్యాపింగ్‌పై అందరికీ తెలియాలనే మీడియా మీట్ పెట్టబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. హోంమంత్రి అమిత్ షాకు (Amit Shah) కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామన్నారు కోటంరెడ్డి.

kotam-2.jpg

మొత్తానికి చూస్తే.. బుధవారం మీడియా మీట్‌లో వైసీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చేయడానికి సిద్ధం అయినట్లే స్పష్టంగా అర్థం అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ గురించే మాట్లాడుతారా.. లేకుంటే పార్టీకి రాజీనామా (resignation) చేయడంపై కూడా తేల్చేస్తారా..? అనేదానిపై ఆయన అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రాజీనామా చేస్తే పరిస్థితేంటి.. పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉంటారా.. లేకుంటే రూమర్స్ నడుస్తున్నట్లుగా టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-31T22:25:13+05:30 IST