NTR Dist.: వివాహితపై అత్త, భర్త హత్యాయత్నం...

ABN , First Publish Date - 2023-02-25T09:32:15+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం (Mylavaram)లో దారుణం (Atrocity) జరిగింది. వివాహితపై అత్త, భర్త హత్యాయత్నానికి (Attempted Murder) పాల్పడ్డారు.

NTR Dist.: వివాహితపై అత్త, భర్త హత్యాయత్నం...

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం (Mylavaram)లో దారుణం (Atrocity) జరిగింది. వివాహితపై అత్త, భర్త హత్యాయత్నానికి (Attempted Murder) పాల్పడ్డారు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన భార్య మాధవి విజయవాడ (Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే... మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన గుంజ మాధవి (25)పై భర్త శీను, అత్త సులోచన కలిసి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో 12 గంటలకు అత్త, భర్త కలిసి మాధవిని హతమర్చే ప్రయత్నం చేయగా ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగువారు గమనించి దాడిని అడ్డుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా భర్త శీను మైలవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

అలాగే పల్నాడు జిల్లా, బెల్లంకొండలో మరో ఘటన జరిగింది. భర్తపై భార్య దాడి చేసింది. భర్త గుర్రాల బడే బచ్చా.. వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను వేధిస్తున్నాడని భార్య కర్రతో దాడి చేసింది. తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా బడే బచ్చా వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

Updated Date - 2023-02-25T09:32:20+05:30 IST