Pawan Kalyan : పవన్‌పై సెక్షన్స్ అన్నీ వాడేసి మరీ కేసు..
ABN , First Publish Date - 2023-07-13T08:02:58+05:30 IST
ఏలూరు వారాహి యాత్రలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. పవన్ కళ్యాణ్‌పై నిన్న విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
విజయవాడ : ఏలూరు వారాహి యాత్రలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. పవన్ కళ్యాణ్‌పై నిన్న విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) IPC సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది. 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. మొత్తానికి సెక్షన్స్ అన్నీ వాడేసి మరీ కేసు ఫైల్ చేశారు.
వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్లతో పనేంటి? అని ప్రశ్నించారు. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? అని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదన్నారు. ఈ డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోందని తెలిపారు. పది మంది ఇంటింటికీ తిరుగుతుంటే ఎలా? అని ప్రశ్నించారు. వాలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారని, ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకి తెలుసన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా వాళ్లకి తెలుస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉండవచ్చు.. సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.