Share News

Skill Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

ABN , First Publish Date - 2023-10-17T12:04:40+05:30 IST

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. బాబు తరఫున న్యాయవాదులు అభ్యర్థన మేరకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. 19న పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉంది.

Skill Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) చంద్రబాబు (Chandrababu) బెయిల్ పిటిషన్‌‌పై (Bail Petition) విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్ట్ విచారణను వాయిదా వేసింది. తిరిగి 19న పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉంది.

స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, దీంట్లో 17ఏ నిబంధనను పాటించలేదని, బాబును అరెస్టు చేయాలంటే ముందుగా రాష్ట్ర గవర్నర్ (Governor) అనుమతి తీసుకోవాలని, అలా జరగని కారణంగా ఈ పిటిషన్‌ను క్వాష్ చేయాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విరుద్ధమైన తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబు సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై వాదోపవాదాలు జరుతుగున్నాయి. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, ప్రభుత్వం తరఫున ముఖుల్ రోహత్గి మూడు రోజులపాటు వాదనలు వినిపించారు. మంగళవారం కూడా ఫైనల్ వాదనలు వినిపించిన తర్వాత తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా చంద్రబాబు సుమారు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించకుండానే బాబును అదుపులోకి తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2023-10-17T12:11:35+05:30 IST