Vijayawada: ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం..

ABN , First Publish Date - 2023-08-17T14:19:02+05:30 IST

విజయవాడ: నగరంలో ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవమార్పిడి చేయించుకున్నాడు.

Vijayawada: ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం..

విజయవాడ: నగరంలో ప్రేమ పేరు (Love)తో విచిత్రమైన మోసం (Fraud) వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవమార్పిడి చేయించుకున్నాడు. పవన్ భ్రమరాంబగా మారిన తర్వాత నాగేశ్వరరావు పెళ్లికి నిరాకరించాడు. దీంతో భ్రమరాంబ అలియాస్ పవన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వింత ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. కొంతకాలం ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే కలకాలం కలిసి ఉండాలని భావించారు. ఈ క్రమంలో నాగేశ్వరరావు దగ్గరుండి పవన్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి లింగమార్పిడి చేయించాడు. తిరిగి వచ్చిన తర్వాత పవన్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఖర్చుల కోసం పవన్ తన ఇంటి నుంచి సుమారు రూ. 20 లక్షలు తెచ్చినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అన్నింటికి పవన్ ద్వారా నాగేశ్వరరావు డబ్బులు ఖర్చు చేయించాడు. పోలీసుల విచారణ జరుగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-08-17T14:19:02+05:30 IST