CM Jagan: బందరు పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2023-05-22T10:31:08+05:30 IST
మచిలీపట్నంలో బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను సమర్పించారు.
కృష్ణా: మచిలీపట్నంలో బందరు పోర్టు (Bandaru Port) పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను సమర్పించారు. బ్రేక్ వాటర్ పనుల్లో భాగంగా 99 లారీల్లో తీసుకొచ్చిన కొండ రాళ్ళతో డంపింగ్ చేశారు. దీంతో తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బందరు పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. శంకుస్థాపన జరిగినే రోజే బందరు పోర్టు పనులు మొదలయ్యాయి. ఆపై జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం వెళ్లనున్నారు.