Share News

CM Jagan: గురువారం విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ABN , First Publish Date - 2023-12-06T21:44:17+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) గురువారం (రేపు) విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

CM Jagan: గురువారం విజయవాడలో సీఎం జగన్ పర్యటన

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) గురువారం (రేపు) విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 8.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చేరుకుని అక్కడ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుని తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు.

Updated Date - 2023-12-06T21:44:24+05:30 IST