AP News: బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆందోళనలకు పిలుపు
ABN , First Publish Date - 2023-11-21T16:00:42+05:30 IST
కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది.
అమరావతి: బకాయిల కోసం ఆందోళన బాట పట్టాలని కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తమ బకాయిలు చెల్లించాలని బుధవారం విజయవాడలో (Vijayawada) కంటాక్టర్లు ఆందోళన చేపట్టనున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( BAI) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టనున్నారు.
రూ.100 కోట్ల జమ..
కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది. ఇటువంటి వాటికి తాము లొంగేది లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. BAI ఆందోళనకు మద్దతు ఇచ్చి తాము కూడా ధర్నాలో పాల్గొంటామని SABCA సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు విజయవాడకు బయలుదేరారు. తమ బకాయిలు కోసం ధర్నా చేసి తీరుతామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తమకు పూర్తిగా బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.