Devineni Uma: ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2023-08-29T13:28:59+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.

Devineni Uma: ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ: దేవినేని ఉమ

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ నాయకులు (YCP Leaders) చేస్తున్న ఇసుక దోపిడీ (Sand Mining)పై నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు (Devineni Umamaheswararao), టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతోందని, జేపీ సంస్థ (JP Company) ముసుగులో సీఎం జగన్ (CM Jagan) అక్రమ ఇసుక దందా నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. జేపీ వెంచర్స్‌తో ఒప్పందం ముగిసినా, జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయినా.. అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుకతవ్వి రూ. 40 వేల కోట్లు దోచేసి.. ముఖ్యమంత్రి ఇసుకాసురుడుగా మారారన్నారు.

టీడీపీ ప్రభుత్వం (TDP Govt.) ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ధర ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి, వైసీపీ నాయకులు దోచుకుతింటున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. నిల్వ ఉంచిన అక్రమ ఇసుకకు పర్మిషన్‌, స్టాకు నిల్వలపై రికార్డులు చూపాలని డిమాండ్ చేశారు. టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, ఎన్‌జీటీ (NGT) విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అన్ని నియోజకవర్గాల నాయకులంతా కలిసి రేపు (బుధవారం) విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ఇసుక దోపిడీ గురించి టీడీపీ సేకరించిన ఆధారాలను డీఎంజీ (DMG) డైరెక్టర్‌కు చూపించి వైసీపీ చేస్తున్న ఇసుక దోపిడీని అరికట్టాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని దేవినేని ఉమ అన్నారు.

Updated Date - 2023-08-29T13:28:59+05:30 IST