Devineni Uma: నన్ను చంపేందుకు కుట్ర పన్నారు
ABN , First Publish Date - 2023-07-08T17:46:50+05:30 IST
వైసీపీ నాయకులు తన మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారని, తనను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే కొండపల్లి(Kondapally)లో తన మీద, తన కారు మీద వైసీపీ(YCP)శ్రేణులు దాడి చేశాయని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ నాయకులు తన మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారని, తనను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే కొండపల్లి(Kondapally)లో తన మీద, తన కారు మీద వైసీపీ(YCP)శ్రేణులు దాడి చేశాయని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేపట్టిన బస్సుయాత్ర శనివారం మైలవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వద్ద చింతలపూడి ఫైలన్ వద్ద వైసీపీ ప్రభుత్వానికి (YCP GOVT) దేవినేని ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
బస్సు యాత్రకు రెడ్డిగూడెం టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరిలో మునిగి పోకుండా గోదావరి తల్లి బతికించింది. తన జీవిత ఆశయం ఒక్కటే ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన చింతలపూడి ప్రాజెక్ట్(Chintalapudi Projectచింతలపూడి ప్రాజెక్ట్) ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానని చెప్పారు. చింతలపూడి ప్రాజెక్ట్‌కు 5 వేల కోట్లు మంజూరు చేస్తే 4100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు(CHANDRABABU) అధికారంలోకి వస్తే చింతలపూడి ద్వారా గోదావరి నీరు ఎన్ఎస్సీ కాలువల్లో పారేవని చెప్పారు. డ్యామ్‌ల్లో నీళ్లు ఉన్న చెరువులకు నీరు వదలడం లేదన్నారు. చెరువులలో మట్టి అమ్ముకోవడానికి నీరు రాకుండా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. చింతలపూడి ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి చింతలపూడి ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరిస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఫైలన్ శంకుస్థాపన చేసిన ప్రదేశం ఒక దేవాలయమని, సంఘ విద్రోహులు చేరి నాశనం చేస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.