AP Ministers: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవాతో మంత్రుల ఎమర్జెన్సీ మీటింగ్

ABN , First Publish Date - 2023-03-17T14:45:26+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసరంగా సమావేశమయ్యారు.

AP Ministers: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవాతో మంత్రుల ఎమర్జెన్సీ మీటింగ్

అమరావతి: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election Counting) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు సీమల్లో టీడీపీ అభ్యర్థులు (TDP Candidates) అత్యధిక మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యే (Ministers and MLAs of Uttarandhra)లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేక ఉందనుకున్నాం... కానీ ఈ స్థాయిలో ఉందని అంచనా వేయలేకపోయాం అని నేతలు విశ్లేషిస్తున్నారు. తాము ఎన్నికల్లో ప్రయోగించిన అన్ని అస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలం అయ్యాయని నేతలు భావించారు. వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయాన్ని వదిలేయడం వల్ల వచ్చిన ఫలితం అంటూ నేతలు నిట్టూర్పు విడిచారు.

సీఎం జగన్ (CM Jaganmohan Reddy) ఎన్నికల ఫలితాలను ఎలా స్వీకరిస్తారో అనే అంశంపైనా చర్చ జరిగింది. రాయలసీమ (Rayalaseema)లో కూడా వ్యతిరేక ఓటు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కదా అని కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేశారు. కడప (Kadapa) జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో వైసీపీ (YCP)కి అనుకూల ఓటింగ్ జరగలేదని మరి కొందరు తెలిపారు. మంత్రుల పదవులకు ముప్పు అనే ప్రచారాన్ని అమాత్యులు తప్పు పట్టారు. 9 జిల్లాలు, 108 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల నాడి స్పష్టం అయ్యిందని నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని.. ఈ ఫలితాలు తమకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని నేతలు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-03-17T14:45:26+05:30 IST