Gidugu Rudraraju: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయం..

ABN , First Publish Date - 2023-05-13T15:10:01+05:30 IST

విజయవాడ: కర్నాటక (Karnataka)లో కాంగ్రెస్ (Congress) విజయంతో ఏపీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Gidugu Rudraraju: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయం..

విజయవాడ: కర్నాటక (Karnataka)లో కాంగ్రెస్ (Congress) విజయంతో ఏపీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju), సుంకర పద్మశ్రీ (Sunkara Padma Shri) తదితరులు టపాసులు కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ (BJP)కి ‌చెంప పెట్టు అన్నారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కర్నాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అద్భుతమైన విజయం అందించారన్నారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఖర్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)తో సహా ఎంతోమంది పెద్దలు టీం వర్కు చేశారని, అందరూ సమిష్టి ప్రణాళికతో ఈ‌ విజయం వరించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకుంటోందని, 2024 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గృహ‌జ్యోతు, గృహ లక్ష్మి, అన్నదాత, యువ నిధి, మహిళా శక్తి పధకాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని, కాంగ్రెస్ హామీలను అమలు చేస్తుందనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లో, కాంగ్రెస్‌లో మంచి‌ జోష్ వచ్చిందన్నారు. మధ్య తరగతి ప్రజలపై పడిన భారాలు ఈ ఎన్నికలలో ఓట్లు ప్రభావం కనిపించిందన్నారు. ప్రధాని మోదీ స్వయంగా రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులో జరిగే ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ ఉంటుందని గిడుగు రుద్రరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-13T15:10:01+05:30 IST