TDP: నిమ్మకూరులో ఆలోచింప చేస్తూ ఆకట్టుకుంటున్న స్లోగన్లు

ABN , First Publish Date - 2023-04-13T10:24:06+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన రెండో రోజుకు చేరుకుంది.

TDP: నిమ్మకూరులో ఆలోచింప చేస్తూ ఆకట్టుకుంటున్న స్లోగన్లు

కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన రెండో రోజుకు చేరుకుంది. గత అర్ధరాత్రి మచిలీపట్నంలో సభ ముగిసన తర్వాత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు (TDP Chief) బస చేశారు. ఈరోజు నిమ్మకూరులో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా నిమ్మకూరులో ఏర్పాటు చేసిన బ్యానర్లపై స్లోగన్లు అందరినీ ఆలోచింప చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ‘‘చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం, చంద్రన్నే చిన్నారుల భవిష్యత్తుకు సంకేతం’’ అంటూ చిన్నారుల ఫొటోలతో మా భవిష్యత్తుకి మీరే భరోసా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ‘‘అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి ఎదిగారు. ఎవరో గొప్పగా చెబితే వచ్చిన కీర్తి కాదు మీది. ఎవడో ఏదో వాగితే తగ్గే స్థాయి అంతకంటే కాదు మీది’’ అంటూ చంద్రబాబు ఫొటోతో అభిమానులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు మచిలీపట్నంలో బహిరంగ సభ అనంతరం నిమ్మకూరులో గత రాత్రి బస చేసిన చంద్రబాబు... మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించనున్నారు. అనంతరం నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. గ్రామస్తులకు బట్టలు పెట్టనున్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో నందమూరి కుటుంబసభ్యులు ఇప్పటికే నిమ్మకూరు చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని గతరాత్రి నిమ్మకూరుకు వచ్చారు. ఈరోజు చంద్రబాబుకు నందమూరి రామకృష్ణ, సుహాసిని బట్టలు పెట్టనున్నారు. అనంతరం నిమ్మకూరు నుంచి గుడివాడలో చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం నుంచి బయలుదేరి గుడివాడలో రోడ్ షో, బహిరంగం సభలో అధినేత పాల్గొంటారు. మరోవైపు నిమ్మకూరు గ్రామం మొత్తం పసుపు తోరణాలు, జెండాలతో అఢభిమానులు అలంకరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-04-13T10:24:06+05:30 IST