ACB court: లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2023-06-30T18:14:49+05:30 IST
కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ
విజయవాడ: కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్‌హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌లో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అద్దెకు ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ఈ గెస్ట్‌హౌస్‌పై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది.