kodali nani: మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-08T14:27:40+05:30 IST

‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న

kodali nani: మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా: ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని (Kodali Nani) కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలా ఉండాలో పకోడిగాళ్ల సలహాలు తన వాళ్లకు ఇచ్చుకుంటే మంచిది అని హితవు పలికారు. రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా 200 రోజులు వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. 'యాక్టర్ల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీపై పడతారెందుకు?. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలంటూ' చిరంజీవి హిత‌వు ప‌లికారు.

ఇటీవల పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘బ్రో’ సినిమాలో తనను టార్గెట్ చేస్తూ సినిమా తీశారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) ఫైరయ్యారు. పవన్‌కల్యాణ్ ఎంత రెమ్యూనిషన్‌ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి కూడా మంత్రి అంబటి వెళ్లారు. ఇలా పవన్‌కల్యాణ్-ఏపీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో గతరాత్రి వాల్తేర్ వీరయ్య 200 రోజుల వేడుకల్లో చిరు స్పందిస్తూ... రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ మీద పడతారెందుకు అని ప్రశ్నించారు. తాజాగా చిరు వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ.. పకోడిగాళ్లు ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇవ్వొద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందా? లేదంటే మరోసారి పొలిటికల్‌గా దుమారం చెలరేగుతుందో వేచి చూడాలి.

Updated Date - 2023-08-08T17:40:55+05:30 IST