Kollu Ravindra: చేయని నేరానికి చంద్రబాబును అరెస్టు చేశారు
ABN , First Publish Date - 2023-09-11T15:07:16+05:30 IST
మచిలీపట్నం (కృష్ణాజిల్లా) : అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఎం జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసి చేయరాని తప్పు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నం (కృష్ణాజిల్లా) : అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఎం జగన్ (CM Jagan), చంద్రబాబు (Chandrababu)ని అరెస్ట్ (Arrest) చేసి చేయరాని తప్పు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసి రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన దార్శనికుడు చంద్రబాబుని.. చేయని నేరానికి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. స్కిల్ స్కాం కేసు (Skill Scam Case)లో చంద్రబాబుకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
సీఎంగా చంద్రబాబు ఓ పాలసీ మేకర్ అని.. అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబు ఎందుకు బాధ్యులవుతారని కొల్లు రవీంధ్ర ప్రశ్నించారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలనపై అన్ని పక్షాలు ఏకమయ్యాయని.. జగన్ పతనం ప్రారంభమైందని అన్నారు. జనసేన కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. బంద్ ప్రశాంతంగా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల సమస్య తలెత్తేలా వ్యవహరిస్తోందని ఆయన ద్వజమెత్తారు.