Devineni Uma: పోలవరం కోసం ఎంతోమంది భూములు త్యాగం చేశారు...

ABN , First Publish Date - 2023-04-05T14:11:42+05:30 IST

పోలవరం (Polavaram) కోసం ఎంతోమంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) అన్నారు.

Devineni Uma: పోలవరం కోసం ఎంతోమంది భూములు త్యాగం చేశారు...

విజయవాడ: పోలవరం (Polavaram) కోసం ఎంతోమంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాను వెళ్లిన సమయంలో అక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నారని, వాళ్ల ఇబ్బందులు తెలుసుకుని వారికి డబ్బులు ఇచ్చామన్నారు. రెండోసారి కూడా చంద్రబాబు (Chandrababu) రూ. 130 కోట్లు‌ ఇచ్చారని, వారికి పక్కా ఇళ్లు కట్టించేలా చర్యలు చేపట్టామన్నారు. డయా ఫ్రం వాల్ (Dia from Wall) కోసం 300 అడుగులు కిందకి‌ వెళ్లామని తెలిపారు.

ముంపు గ్రామాల ప్రజల సహకారం వల్లే తాము పురోగతి సాధించామని దేవినేని ఉమ అన్నారు. దేశంలో‌16 జాతీయ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలో జరుగుతున్నాయని, పోలవరం స్థాయిలో ఏ ప్రాజెక్టు పనులు జరగలేదన్నారు. 13వేల 260 కోట్ల రూపాయలు పోలవరం కోసం చంద్రబాబు తెచ్చారని,

చేసిన పనులకు డబ్బులు ఇవ్వమంటే ఇరిగేషన్ కాంపోనెంట్ (Irrigation Component) అనే పదం‌ ప్రస్తావించారన్నారు. మూడు వేల‌కోట్లు వెనక్కి ఇవ్వడానికి లక్ష డాక్యుమెంట్లు అడిగారని, ఆనాడు పది అంతస్తులు ఎక్కి ఆ మొత్తం ఇచ్చామని చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర జల వనరుల శాఖ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,540 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు.

ఆ తరువాత ఎన్నికలు రావడం, జగన్ సీఎం‌ (CM Jagan) కావడం జరిగిందని, పోలవరం ప్రాజెక్టును పరిశీలించి అంతా ఓకే అని ‌చెప్పిన ముఖ్యమంత్రి.. తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి పనులు క్యాన్సిల్ అని ప్రకటించారని దేవినేని ఉమ విమర్శించారు. నిపుణులు ఎంత నచ్చ చెప్పినా సైకో సీఎం చెవికి ఎక్కలేదన్నారు. ఎనిమిది వందల‌ కోట్ల ఆదా అని చెప్పి.. ఇప్పటి వరకు రూ. 1600 కోట్లు కట్టారన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమ దోచేశారని వారి అవినీతి పత్రికలో రాసుకున్నారని మండిపడ్డారు. నిబంధనల‌ ప్రకారం పోలవరం కట్టారని, ఎటువంటి అవినీతి ‌జరగలేదని కేంద్రమే చెప్పిందన్నారు. జరుతున్న పనులను నిర్దాక్షిణ్యంగా ఆపేసి కాంట్రాక్టు కంపెనీలను పంపేశారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, పోలవరం నిర్వాసితులను ఆదుకునేది‌ చంద్రబాబేనని దేవినేని ఉమ స్పష్టం చేశారు. వైసీపీ స్వార్ధం‌ కోసం నిర్వాసితులకు అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. బాబాయి వివేక హత్య కేసు నుంచి తప్పుకోవడానికి జగన్ కేంద్రాన్ని నిలదీయ లేక పోతున్నారని.. ఈ దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం వల్ల రైతులు, నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేయాలని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఎటువంటి కార్యక్రమం చేపట్టినా టీడీపీ మద్దతు ఉంటుందని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-05T14:11:42+05:30 IST