Raghurama: సీఎం జగన్ వింత, విచిత్ర వాదనలు చేస్తున్నారు
ABN , First Publish Date - 2023-08-22T16:56:21+05:30 IST
సీఎం జగన్ జీపీఎస్‌ను తీసుకొచ్చారని, గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్.. అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయిని అంటున్నారు... వారికి సిగ్గు ఉండాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో లక్షల మందికి నేత్రదానానికి చిరంజీవి భాగస్వామ్యం అయ్యారని రఘురామ కొనియాడారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) జీపీఎస్ (GPS)ను తీసుకొచ్చారని, గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్.. అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయిని అంటున్నారు... వారికి సిగ్గు ఉండాలన్నారు. జగనన్న ఉన్న స్కూల్స్‌ను మూసివేశారని, టీచర్లను తీసేశారని విమర్శించారు. సీఎం జగన్ ఓపీఎస్ (OPS) ఇస్తే చంద్రబాబు (Chandrababu) వచ్చిన తర్వాత ఉద్యోగులను తీసేస్తారని ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రికి మైండ్ చెడిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ వింత, విచిత్ర వాదనలు చేస్తున్నారని అన్నారు.
A1కు రుషికొండ.. మరి తనకు వద్ద అని A2 అనుకున్నారనుకుంటా.. భీమునిపట్నం తుర్లవాడా కొండపై ఉన్న 120 ఎకరాలపై కన్నువేశారని రఘురామ అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అనుకుంటే భూమి కొనుక్కోవాలని, విలువైన భూమిని రూ. 15 కోట్లకు తీసుకోవాలని చూస్తున్నారని, విజయసాయిరెడ్డి ఆలోచన అద్బుతమన్నారు. మార్కెట్ రేటు ఇచ్చి సాయిరెడ్డి భూములు కొనుక్కోవాలని, అక్రమంగా తీసుకుంటే వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తుందని హెచ్చరించారు.
వచ్చే ప్రభుత్వంలో అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) మంత్రి అవుతారని... అప్పుడు ఇబ్బందులు తప్పవని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. విశాఖపట్నంలో వైసీపీ (YCP) తుడిచిపెట్టుకుపోతుందని.. దానికి వైసీపీ భూ దాహమే కారణమన్నారు. విశాఖలో ఎవరెవరూ ఎంత కన్నాలు వేశారో అందరికీ తెలుసునని, విశాఖలో అతి దారుణంగా వైసీపీ పరాజయం చెందుతుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.