Raghurama: జగనన్న రాజ్యంలో పెరిగిపోతున్న వికలాంగులు..
ABN , First Publish Date - 2023-08-02T14:20:04+05:30 IST
న్యూఢిల్లీ: జగనన్న రాజ్యంలో వికలాంగులు విపరీతంగా పెరిగిపోతున్నారని, ఓటర్ల ఓట్లు కొనుగొలు కోసం ఓటర్లను వికలాంగులగా మార్చారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
న్యూఢిల్లీ: జగనన్న రాజ్యంలో వికలాంగులు విపరీతంగా పెరిగిపోతున్నారని, ఓటర్ల ఓట్లు కొనుగొలు కోసం ఓటర్లను వికలాంగులుగా మార్చారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విరపనాయిని మండలంలో ఎన్ పాలగిరీ అనే గ్రామంలో 215 మంది వికలాంగులు ఉన్నారని, అందులో ఒకే కులానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని అన్నారు. డాక్టర్‌కు రూ. పదివేలు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తున్నట్లు తెలిసిందని, ఎవరి డబ్బు పోతుంది.. జగన్ సొమ్ము కాదు కదా... రాష్ట్రంలో 5 లక్షల మందికిపైగా వికలాంగులు ఏంటని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ఇంత ఇస్తున్న జనాలకు అసంతృప్తి.. జగన్‌కు సంతృప్తి లేదని అన్నారు.
దొంగ వికలాంగుల సర్టిఫికేట్ తీసుకుంటున్నావారిపై చర్యలు తీసుకోవాలని, నిజమైన వికలాంగులకు న్యాయం జరగాలని, నిజమైన వికలాంగులకు రూ. 5 వేలు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. పురంధేశ్వరి దెబ్బకు వైసీపీ నేతలు అల్లాడిపోతున్నారని, రూ. 10 లక్షల 77 వేల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసిందని నిన్న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాడ్ చేసిందా? లేక ఆర్థిక శాఖ తప్పు చెప్పిందా?.. దొంగ లెక్కలపై ఒక్కరూ చర్చకు రావడం లేదని అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో మంత్రి అంబటి చెప్పడంలేదన్నారు. ‘బ్రో’ సినిమా గురించి అంబటికి ఏం అవసరం అని ప్రశ్నించారు. బ్రో సినిమా లెక్కలు చెప్పాలని అంటున్నారని, పవన్ కళ్యాణ్ స్టార్ క్రేజ్‌కు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారన్నారు. గొడ్డలితో బాబాయ్ హత్య సినిమా తీసుకోండని సూచించారు. మంత్రి పదవిలో ఉన్న రాంబాబు సినిమా తీయాల్సిన అవసరం లేదని.. ఎవరైనా తీయొచ్చునని రఘురామ వ్యాఖ్యానించారు.