Raghurama: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?...
ABN , First Publish Date - 2023-04-17T14:40:28+05:30 IST
ఢిల్లీ: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?.. అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు.
ఢిల్లీ: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?.. అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రక్తం తుడిచి, కడిగేసిన వారు కోర్టులో పిటిషన్ వేశారని.. తాను జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కేసులో బెయిల్ కొట్టేయాలని అడిగితే ఇదే హైకోర్టు చీఫ్ 11 నెలల తర్వాత తీర్పు ఇచ్చారని, తన కేసు కొట్టేశారని అన్నారు. అయితే ఎవరూ కోర్టును అనుమానించ వద్దని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయస్థానాలపై గౌరవం ఉందని.. సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్‌ను వెళ్లి కలుస్తానని.. ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు.
సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి (Bharathi Reddy) మేనమామ భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారని.. దీంతో పులివెందులలో వైకాపా కార్యకర్తలు కలత చెందారని రఘురామ అన్నారు. లీగల్ బ్రోకర్ విజయ్ కుమార్ (Vijaya Kumar) ప్రత్యేక విమానంలో ఒక పారిశ్రామిక వేత్త కుమారుడు తీసుకొచ్చారని తెలిసిందన్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై సాక్షిలో రెండు లైన్లు మాత్రమే రాశారని.. అవినాష్ రెడ్డి (Avinash Reddy) వ్యాఖ్యలను ఫ్రంట్ పేజీలో వేశారన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని.. ఎంతమంది బ్రోకర్లు విజయ్ కుమార్ లాంటి వారిని ప్రవేశ పెట్టిన ఏమి కాదని అన్నారు. వైఎస్ వివేకా (YS Viveka) చనిపోయినప్పుడు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఎం చెప్పారో అందరికీ తెలుసునని అన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు... రక్తపు మడుగులో ఉంటే.. గుండె పోటు అని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
సీబీఐ దగ్గర ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి ఎలా చెప్తారని రఘురామ ప్రశ్నించారు. వివేకకు వజ్రాల వ్యాపారి భార్యతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అంటున్నారు... వజ్రాల వ్యాపారితో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని అన్నారు. ఇంత కంగారు పడుతుంటే హత్య వెనుక సాక్షి యాజమాన్యం ఏమైనా ఉందా? అనే అనుమానం వస్తోందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని, పార్టీని నవ్వులపాలు చేయొద్దని రఘురామ సూచించారు.