Delhi: సుప్రీంకోర్టులో భారతి సిమెంట్ కేసుపై స్పందించిన ఎంపీ రఘురామ..
ABN , First Publish Date - 2023-02-17T16:26:27+05:30 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో భారతి సిమెంట్ కేసు (Bharati Cements Case)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో భారతి సిమెంట్ కేసు (Bharati Cements Case)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) స్పందించారు. ఈ
సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత హైకోర్టు (High Court) తీర్పును సుప్రీంకోర్టు సమర్థించి ఉంటే బెంచ్ హంటింగ్ (Bench Hunting) అనే వారని...బెంచ్ హంటింగ్ అలిగేషన్ రావడం దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో నిన్న శరత్ చంద్ర రెడ్డి (Sarath Chandra Reddy)కి బెయిల్ (Bail) ఇవ్వలేదని... గతంలో సుప్రీంకోర్టు ఆర్థిక నేరాల్లో ఉన్నవారికి బెయిల్ ఇవ్వొద్దని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. గతంలో సుప్రీంకోర్టులో ఏ1 (A1), ఏ2 (A2)లకు బెయిల్ నిరాకరించిందని, దాన్ని నిన్న సీబీఐ కోర్టు (CBI Court)లో ప్రస్తావించారని, జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) కేసు కూడా ప్రస్తావించారని.. ఈ అంశం తనకు బాధ కలిగించిందన్నారు.
కాగా భారతీ సిమెంట్స్ కేసు శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణకు రాలేదు. హఠాత్తుగా జాబితా నుంచి మాయం కావడం విస్తుగొలుపుతోంది. అసలేం జరిగిందంటే.. భారతీ సిమెంట్స్ కేసును న్యాయమూర్తి వి. రామసుబ్రమణ్యన్, పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జాబితాలో రిజిస్ట్రీ చేసింది. 16వ నంబర్ కేసుగా జాబితాలో రిజిస్ట్రీ అయ్యింది. అయితే.. 15వ నంబర్ కేసును విచారించిన తరువాత 16వ నంబర్ కేసు వినాలి కానీ ధర్మాసనం నేరుగా 17వ నెంబర్ కేసును విచారించింది. ఈ పరిణామం విస్తుగొల్పుతోంది.
ఈ వార్త కూడా చదవండి...
బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారు?...
జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను ఈడీ (ED) అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ కోర్టు, హైకోర్టు వ్యతిరేకంగా తీర్పును వెలువరించాయి. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ సవాలు చేసింది. ఈ కేసును మొదట జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్‌ల బెంచ్ ముందు రిజిస్ట్రీ విచారణకు ఉంచింది. మొదటి విచారణ సందర్భంగా తదుపరి తేదీకి జస్టిస్ కృష్ణ మురారి, వి.రామసుబ్రమణ్యన్‌ల ధర్మాసనం వాయిదా వేసింది.
తరువాత సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఈ నియామకం అనంతరం కొత్త ధర్మాసనాలను సీజేఐ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భారతీ సిమెంట్స్ కేసు విచారణను జస్టిస్ మురారి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ముందు విచారణకు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది. అయితే హఠాత్తుగా జాబితా నుంచి కేసు మాయమైంది. జాబితా నుంచి చివరి నిమిషంలో డిలీట్ అయినట్లు ఈడీ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.