Raghurama: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ రఘురామ..
ABN , First Publish Date - 2023-05-14T12:25:59+05:30 IST
న్యూఢిల్లీ: పిశాలచాల పీడ పోవాలని హనుమంతుడిని కోరుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: పిశాలచాల పీడ పోవాలని హనుమంతుడిని కోరుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు అండదండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన పుట్టినరోజు.. అలాగే ఏపీ ప్రభుత్వం తనను నిర్బంధించి కొట్టిన రోజు 14 మే 2021న జరిగిందన్నారు. నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారన్నారు. తాను అవినాష్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డిలా హత్య కేసులో లేనని చెప్పారు. వెంకటేశ్వర స్వామి భూములను అమ్మ వద్దని చెప్పడమే తప్పు అయ్యిందని, ఇసుక రేట్లు రెండు ఇంతలు పెరగడం మన ప్రభుత్వానికి నష్టం అని చెప్పడం కూడా తప్పు అయ్యిందని రఘురామ అన్నారు.
ఎక్కడాలేని మందు బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతాయని, అవి త్రాగడం వల్ల చాలా మంది ప్రాణాలు పొగుట్టుకుంటున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి చనిపోయిన వాళ్ళకే వితంతు పింఛన్ ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికే సాధ్యమని ఎద్దేవా చేశారు. పేదవాడి దగ్గర నుంచి ప్రతి రోజు కనీసం 150 రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో 40శాతం కమిషన్ అనేది నిజమో కాదో తెలియదు.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం కమిషన్ అని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా కొట్టారన్నారు. తనకు తగిలిన దెబ్బలపై మేజిస్ట్రేట్ నోటు చేశారని.. కానీ తనకు వైద్యం చేసిన డాక్టర్లు రిపోర్టులో పొందుపర్చలేదన్నారు. ఎటువంటి నేరారోపిత లేని కుటుంబంలో తాను పుట్టానని రఘురామ వ్యాఖ్యానించారు.