Raghurama: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదు..
ABN , First Publish Date - 2023-06-20T14:53:51+05:30 IST
ఢిల్లీ: జగనన్న ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదని, సాక్షికి తప్ప ఎవరికీ లాభం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
ఢిల్లీ: జగనన్న (Jagananna) ఆణిముత్యాలేంటో అర్థం కావడం లేదని, సాక్షికి తప్ప ఎవరికీ లాభం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama krisnamraju) విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘జగన్ నువ్వే మా దేవుడు అని కొందరు పాటలు పడుతున్నారు... కొంచం ఎబ్బెట్టుగా ఉంది.. జగన్ అది తగ్గించుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రంలో 6 వేల స్కూల్స్ (Schools) మూసివేశారని, దేశంలో స్కూల్స్ డ్రాప్ ఔట్‌లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ (TDP), జనసేనా (Janasena) పొత్తు ఉంటుందని, వైసీపీ (YCP) ఊహిచించినది జరగదని రఘురామ అన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను తిట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) స్పందించి ఉంటే బాగుండునని అన్నారు. ఎంతో మంది కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ తిట్టించారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను దుర్భాషలాడిన జగన్, వారి మంత్రుల తీరుపై కూడా ముద్రగడ స్పందించి ఉంటే బాగుండునని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.