Raghurama: వివేకా హత్య కేసు.. షర్మిల క్లియర్‌గా చెప్పారు
ABN , First Publish Date - 2023-07-22T16:03:39+05:30 IST
న్యూఢిల్లీ: వివేక హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక అంశాలు ఉన్నాయని, వివేక హత్య కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: వివేక హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) ఛార్జిషీట్‌లో అనేక అంశాలు ఉన్నాయని, ఈ కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama KrishnamRaju) అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డితో రాయించిన లేఖ (కాగితం) ముందు ఎవరు పెట్టారో దాని వేలిముద్రలు కూడా ఉంటాయని, వాటిపై సీబీఐ (CBI) ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారన్నారు. అందరి వేలిముద్రలు సీబీఐ తీసుకుందని, ఇవ్వన్నీ తేలాల్సి ఉందన్నారు.
వివేకా హత్య ఆస్తి కోసం కాదని.., కేవలం రాజకీయ హత్య అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) చెప్పారని రఘరామ అన్నారు. లోకేష్ (Lokesh)కు హక్కు ఉందని, ఆయన అడగవచ్చునని.. ఎందుకంటే వారి కుటుంబం నారసురా రక్త చరిత్ర అని మరి వైసీపీ (YCP) వాళ్ళు వేశారన్నారు. అజేయ కల్లం స్టేట్‌మెంట్ ఇచ్చారని.. ఉదయం సమావేశం జరగుతున్న సమయంలోనే జగన్ (Jagan)కు ఫోన్ వచ్చిందని చెప్పారన్నారు. ఉదయం 5.30 గంటల సమయంలో వివేకా నంద రెడ్డి చనిపోయారని, జగన్ చెప్పినట్టు సిబిఐకు అజేయ కల్లం స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. అవినాష్ రెడ్డి 6.30 గంటలకు జగన్ పీఏకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి చనిపోయారని చెపితే... సాక్షిలో గుండెపోటు కథనాలు ఎందుకు వచ్చాయి?.. విజయసాయిరెడ్డి ఏడుపు మొఖం పెట్టి వివేక గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారని ప్రశ్నించారు.
5.30 లేదా 6.30 గంటలకు వివేక రక్తపు మడుగులో పడి చనిపోయారని అంటే?.. గుండెపోటుగా చిత్రీకరించే అవసరం ఎందుకు వచ్చిందని రఘురామ ప్రశ్నించారు. బాత్రూమ్‌లో రక్తం ఉందని అన్నారు మరి ఎందుకు కవర్ చేశారన్నారు. కృష్ణమోహన్ రెడ్డి స్పష్టంగా సీబీఐకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో జగన్ కడప వెళ్లేందుకు విమానం కూడా సిద్దం చేశానని చెప్పారని.. మరి విమానం సిద్ధంగా ఉన్నా.. జగన్ కారులోనే కడప ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని వేరే వాళ్లు అన్నట్టు తాను అనలేనని, కానీ సీబీఐ మాత్రం జగన్‌కు ముందే తెలుసు అనే అంశం అందులో స్పష్టం చేసిందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.