Pattabhi: ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్రమ కేసులు పెట్టారు.. చంద్రబాబు సారధ్యంలో పోరాటం కొనసాగిస్తాం
ABN , First Publish Date - 2023-03-04T18:57:44+05:30 IST
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) ఆరోపించారు.
విజయవాడ: పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) ఆరోపించారు. కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టం వచ్చిందని పీఎస్‌కు వెళ్లడం తప్పా? అని ABNతో పట్టాభిరామ్ అన్నారు. బాధితులనే నిందితులుగా మార్చి ఇబ్బందులు పెడతారా? అని పట్టాభి ప్రస్నించారు. వైసీపీ (YCP) రౌడీల రాళ్ల దాడివల్లే సీఐ గాయపడ్డారని, సీఐపై దాడి జరిగిన సమయంలో తాను అక్కడ లేను అని పట్టాభి చెప్పారు. అయినా తనపై హత్యాయత్నం కేసు పెట్టారని, టీడీపీ ఆఫీస్ (TDP Office)పై దాడిచేసినవారిలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే పోలీసులు పాటిస్తున్నారని, తప్పుడు కేసులకు భయపడేది లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. చంద్రబాబు సారధ్యంలో పోరాటం కొనసాగిస్తామని పట్టాభిరామ్ పేర్కొన్నారు.
పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram)కు కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి పట్టాభి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టు (court)బెయిల్ మంజూర్ చేసింది. రూ.25వేల చోప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి