Perni Nani: సీఎం జగన్ ఇంటి ముందు నిరసన చేస్తాం..
ABN , First Publish Date - 2023-07-19T17:10:33+05:30 IST
విజయవాడ: ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
విజయవాడ: ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) సీరియస్ అయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం జగన్ (CM Jagan) ఇంటి ముందు ధర్నా (Dharna) చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అసలు సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్‌కు ఉందా? లేదా? అని నిలదీశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna Dist.)లో గతంలో ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతున్నారని, అదే విధంగా నియోజకవర్గాలకు సంబంధించిన జడ్పీటీసీ (ZPTC) సభ్యులు, ఎమ్మెల్యేలు (MLAs) వాళ్ల సమస్యలను ఎవరికి వివరించాలని పేర్ని నాని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి ఉత్సవ విగ్రహాల్లా కూర్చోడానికా? ఎందుకనుకుంటున్నారని ఆయన నిలదీశారు. గతంలో కూడా ఈ సమావేశాలకు జిల్లా కలెక్టర్, అధికారులు ఎవరూ రాకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఈ సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేకపోతే చెప్పాలన్నారు. ఈసారి సమావేశానికి రాకపోతే జడ్పీటీసీలు, ఎంపీటీసీ (MPTC)లు అందరం కలిసి సీఎం ఇంటికి వెళతామని, బయట కూర్చోని నిరసన తెలుపుతామని పేర్నినాని స్పష్టం చేశారు.