Purandhareswari: పవన్ వ్యాఖ్యలపై పురంధరేశ్వరి ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-09-17T11:21:53+05:30 IST
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంటర్ జైల్లో కలిసిన తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేసీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు.
విజయవాడ: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu)ను జనసేన అధినేత (Janasena President) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజమండ్రి సెంటర్ జైల్లో కలిసిన తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు (AP BJP Chief) దగ్గుబాటి పురంధరేశ్వరి (Daggubati Purandhareswari) స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని, బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులు.. పవన్ తీసుకువెళతామన్నారని, దీనిపై కేంద్రం పెద్దలు మాతో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు.
చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని, అరెస్టును ఖండిస్తున్నామని మేమే ముందుగా ప్రకటన చేశామని పురంధేశ్వరి అన్నారు. సిఐడీ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని అన్నారు. ఎపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని పురంధేశ్వరి చెప్పారు.