Share News

Raghurama: జగన్ వ్యక్తిగత కక్ష్య మాత్రమే.. కేసులో ఏమి లేదు

ABN , First Publish Date - 2023-10-20T14:51:40+05:30 IST

న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. ఇది జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమేనని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

Raghurama: జగన్ వ్యక్తిగత కక్ష్య మాత్రమే.. కేసులో ఏమి లేదు

న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసు (Fiber Net Case)లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) పిటిషన్ (Petition) విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. ఇది సీఎం జగన్ (CM Jagan) వ్యక్తిగత కక్ష మాత్రమేనని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Mp Raghurama Krishnamraju) అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో 7 రోజుల్లో తీర్పు ఇస్తామని అన్నారని.. ఈనెల 31లోగా వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భగవంత్ కేసరి సినిమా (Bhagwant Kesari movie) బాగుందని, డ్రగ్స్ ఒక పోర్టుకు రావడం, ప్రభుత్వంలో సీఎం దానికి వెనక ఉండడం అనే కథనంతో సినిమా ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. విద్య వ్యవస్థలో సీఎం, ప్రభుత్వం తన తెలివితో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుకోవాలని జగన్ అంటున్నారని, ఇంగ్లీష్ మీడియం (English Medium) మొదటి నుంచి ఉందని అన్నారు. 43 వేల స్కూల్స్‌లో సీబీఎస్ సిలబస్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, అసలు వెయ్యి స్కూల్స్‌కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకొచ్చిందని, అది కాకుండా వేరేది తీసుకొస్తున్నారని, మన దగ్గర దాదాపు 2 లక్షలకుపైగా టీచర్లు ఉన్నారని.. వారికి ఎప్పుడు కోచింగ్ ఇవ్వాలి?.. జగన్ నిర్ణయాలతో విద్యార్ధుల జీవితాలు నాశనమవుతున్నాయని అన్నారు. డబ్బులు తినేయడానికి ఇవ్వన్నీ చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని లక్ష్మీపార్వతి అంటున్నారని, సీఎం జగన్ ముకుల్ రోహత్గికి ఇతర న్యాయవాదులకు ఇన్ని ఏళ్ల నుంచి ఎన్ని కోట్లు ఖర్చయిందో జగన్మోహన్ రెడ్డిని లక్ష్మీపార్వతి అడగాలని రఘురామ సూచించారు. మరి జగన్ తన కేసులకు న్యాయవాదులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టారో.. లేదో లక్ష్మపార్వతి అడగాలన్నారు.

Updated Date - 2023-10-20T14:51:40+05:30 IST