Share News

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

ABN , First Publish Date - 2023-11-21T14:09:44+05:30 IST

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో ఈరోజు రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: సజ్జల మాటల కంటే.. సాక్షిలో రాతలు రోతగా ఉన్నాయి..

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో ఈరోజు రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయాలన్నారు. న్యాయ వర్గాల్లో విస్మయం అని రాశారని, సాక్షి ఇష్టానుసారంగా రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా కేసు వస్తే ఒక రకంగా.. లేదంటే మరో రకంగా మాట్లాడుతారని విమర్శించారు.

లక్ష్మీపార్వతి ఇప్పుడు ఆమె లేఖలో జగన్‌పై కోర్టుకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో రాస్తారా? అని రాఘురామ ప్రశ్నించారు. చంద్రబాబుకు గతంలో ఏసీబీ కోర్టు రిమాండ్ ఇచ్చిందని.. అప్పుడు వైసీపీ నేతలు స్వాగతించారని.. ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇస్తే ఏడుస్తున్నారని.. ఇక నుంచి వైసీపీకి అన్ని ఏడుపులు ఉంటాయని రఘురామ అన్నారు.

ఏపీలో దొంగఓట్ల లొల్లి ఢిల్లీకి చేరిందని, అనంతపురంలో ఒక టీడీపీ నేత ఓటు తీసేశారని, రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఓట్లు తీసేస్తున్నారని రఘురామ ఆరోపించారు. వాలంటిరీ వ్యవస్థ ద్వారా ఎవరు వైసీపీకి ఓటు వేయరో తెలుసుకుని వారి ఓట్లు తొలగిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని సహితం వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, సీఎం జగన్ రాజకీయ విధ్వంసంకు పాల్పడుతున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రఘురామ సూచించారు.

Updated Date - 2023-11-21T14:09:46+05:30 IST