Raghurama: దసరాకు విశాఖ అన్నారు.. ఇప్పడది డిసెంబర్ అయింది
ABN , First Publish Date - 2023-10-17T14:20:04+05:30 IST
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ప్రజలు అనుకుంటున్నారని, దసరాకు విశాఖపట్నం వెళ్తామని అన్నారు... అది ఇప్పుడు డిసెంబర్ అయ్యిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మాట తప్పారని ప్రజలు అనుకుంటున్నారని, దసరా (Dussehra)కు విశాఖపట్నం (Visakhapatnam) వెళ్తామని అన్నారు... అది ఇప్పుడు డిసెంబర్ (December) అయ్యిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ రిషికొండ (Rishikonda)పై రూ. 500 కోట్లతో నిర్మాణాలు చేశారన్నారు. టూరిజం (Tourism) కొరకు నిర్మాణాలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోందని.. టూరిజం కొరకు అయితే అంత పెద్ద నిర్మాణాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిషికొండపై సీఎం నివాసం కట్టుకున్నారు అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరోజు అధికారులు ఆ బిల్డింగ్ చూసి సీఎం కార్యాలయానికి అయితే బాగుంటుందని అంటారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ విశాఖ వెళ్లినా...అధికారులు వెళ్లలేరని సర్వీసు రూల్స్ అడ్డం వస్తాయని రఘురామ అన్నారు. చీఫ్ సెక్రటరీ జోవహర్ రెడ్డి ఎలాగూ రూల్స్ ఫాలో అవుతారని.. ఆయన విశాఖపట్నం వెళ్లలేరు... విషయం లేని వాడు కోటలో ఉన్నా, పేటలో ఉన్న ఒకటే అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. విశాఖలో 9 స్థానాలు టీడీపీ, జనసేన మూకుమ్మడిగా సీట్లు కొట్టేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పకుండా రుషికొండ వెళ్లాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ అన్నారు.